హైదరాబాద్ లోని గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో అత్యాధునిక సిట్టర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ను బుధవారం తెలంగాణ సీఐడీ అదనపు డీజీపీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ లాంఛనంగా ప్రారంభించారు. సెక్టర్ సెక్యూరిటీ రంగంలో పలురకాల పరిశోధనలు చేపట్టడంతో పాటు కన్సల్టెన్సీ సేవలను అందించడం కోసం దీనిని నెలకొల్పారు.
కొత్తగా స్థాపించిన సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ అత్యాధునిక సాంకేతికతను సంతరించుకుంది. ఇందులో 60 డెల్ ఆప్టి ప్లెక్స్ ఎస్ఎఫ్ఎఫ్ 7010 కంప్యూటర్లు, 13న తరానికి చెందిన ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్లు, ఒక్కోటి 2.10 గిగాహెడ్జ్, 32 జీబీ17, ఎస్ఎస్ ప్రాసెసింగ్ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఈ ల్యాబ్ లో జీఫోర్ ఆర్టీఎక్స్ 3050 గ్రాఫిక్స్ కార్డులు, 22 అంగుళాల డెల్ ఎల్ ఈడీ మానిటర్లు, టీఎక్స్, ఫోరెన్సిక్ డూప్లికేటర్ తో పాటు 128 జీబీ రామ్ తో కూడిన రెండు సమగ్ర డిజిటల్ ఫోరెన్సిక్ వర్క్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ సదుపాయాన్ని మూడేళ్ల పాటు 30 మంది వినియోగించుకునే లైసెన్స్ తో పాటు వివిధ సహాయ పరికరాలు, డేటాను భద్రపరిచే డ్రైవ్ లు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా శిఖా గోయెల్ మాట్లాడుతూ, ఇంతటి అత్యాధునిక సదుపాయాన్ని గీతమ్ లో ఏర్పాటు చేయడంపై హర్షం వెలిబుచ్చారు. ఈ ల్యాబ్ సెబర్ ఫోరెన్సిక్స్ అభివృద్ధికి గణనీయంగా దోహదపడగలదని విశ్వాసం వెలిబుచ్చారు. నేటి డిజిటల్ యుగంలో సైబర్ సెక్యూరిటీ ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, సంచలనాత్మక పరిశోధన ప్రాజెక్టులు, కన్సల్టెన్సీ సేవల కోసం ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ఆ తరువాత శిఖా గోయెల్ బీ.టెక్ తొలి ఏడాది విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వేగంగా మారుతున్న సాంకేతికతలను స్వీకరించడానికి వారిని ప్రేరేపించారు. స్థితిస్థాపకత (రిసిలియెన్స్), కృషి, నైతిక ఆశయం లక్షణాలు: వివరిస్తూ, ‘మీరు మన సమాజంలో మార్పును సృష్టించేవారు, ఆవిష్కర్తలు, భవిష్యత్తు నాయకులు, మీరు జీవితంలోని సవాళ్లను అధిగమించేటప్పుడు, పట్టుదల, బలమైన పని నీతి అవసరమని గుర్తుంచుకోండి, అనే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి’ అని ఆమె ఉద్ఘాటించారు.
సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞాన సముపార్జనతో పాటు పరిశోధనల్లో గీతం సామర్ధ్యాలను మెరుగుపరచడానికి ఈ ల్యాబ్ ను ఉద్దేశించినట్టు గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు వెల్లడించారు.
ఈ ప్రారంభోత్సవంలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ వి.రామశాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్యతో పాటు పలు విభాగాధిపతులు, ఉన్నతాధికారులు, అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.