మెదక్ జిల్లా / తూప్రాన్ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మెదక్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తూప్రాన్ మండలంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జిడ్డి ఎల్లం మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్ లో ఉన్న డి ఏ లను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు, మల్టీజోన్ పోస్టులుగా ఉన్న జిహెచ్ఎం పోస్టులను జోనల్ పోస్టులుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మల్టీజోన్ విధానం వల్ల మెదక్ జిల్లా ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మన ఊరు మనబడి నిధులను వెంటనే విడుదల చేయాలని, అప్ గ్రేడ్ చేయని పిఈటి, భాషా పండిట్లను కూడా అప్ గ్రేడ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుబాషి భాస్కర్, జిల్లా నాయకులు రంగారెడ్డి, చక్రవర్తి, కోల వేణు, సంజీవ్, తూప్రాన్ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, భానుచందర్, నాగిరెడ్డి,ఉపాధ్యాయులు బ్రహ్మారెడ్డి,యాదగిరి, శేఖి రెడ్డి, శ్వేత తదితరులు పాల్గొన్నారు.