మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ మాధవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి తహసిల్దార్ జ్ఞాన జ్యోతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . గర్భిణీ స్త్రీలు, బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. చిన్నపిల్లలకు అన్నప్రాసన, సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. శిశువు పుట్టిన గంటలోపు ముర్రిపాలు పట్టించాలని తద్వారా శిశువు ఆరోగ్యంగా ఎదుగుతారని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాణి, అంగన్వాడీ టీచర్లు భూదేవి, పద్మ, స్వర్ణలత, స్వప్న, రేణుక, సెక్టర్ పరిధిలోని అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు ధర్మపురి. ఉపాధ్యాయులు హరిరంజన్ శర్మ, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.