మదనపల్లి : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా యువత క్రమశిక్షణతో దురలవాట్లకు దూరంగా ఉండి క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని,తద్వారా సమాజంలో ఉన్న దురలవాట్లు కలిగిన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.స్థానిక జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరిగిన విద్యార్థుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కళాశాల కరస్పాండెంట్ శ్రీ గురు ప్రసాద్ నాయుడు ప్రసంగిస్తూ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయవద్దని క్రమశిక్షణ కలిగిన యువతే భవిష్యత్తులో ఎక్కడ ఉన్నా ఉన్నత స్థాయిలో రాణిస్తారని ఆయన తెలియజేశారు.టూ టౌన్ సీఐ జి యువరాజు మాదక ద్రవ్యాల వినియోగం పట్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.ఈ సమావేశంలో ప్రిన్సిపల్ రమాదేవితో పాటు టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ డిజి రామమూర్తి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.