అనంతపురం జిల్లా గుత్తి మండల టిడిపి సీనియర్ నాయకులు మాజీ శింగిల్ విండో ప్రెసిడెంట్ కరిడికొండ సూర్య చంద్రుడు (అలియాస్ కరీడికొండ సూరి ) ఆధ్వర్యంలో గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు గుమ్మనూరు జయరామ్, అనంతపురము జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకటశివుడు యాదవ్ ఇంటి దగ్గర మర్యాదపూర్వకంగా కలిసి గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు తన బయోడేటాను సమర్పించి మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి తనకు ఇవ్వవలసిందిగా కోరాడు. గత ముప్పై సంవత్సరాలుగా టీడీపీ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ టీడీపీ పార్టీలోని కార్యకర్తలకు చేదోడు వాదోడుగా వుంటూ ఏ పదవులు ఆశించకుండా పని చేయడం జరిగిందని గుత్తి మండలం కరీడికొండ గ్రామానికి చెందిన సూర్యచంద్రుడు MLAకి వివరించడు. దీనికి MLA సానుకూలంగా స్పందించి తప్పకుండ మీకు న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుత్తి మండల నాయకులు, తెలుగుయువత మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు, సర్పంచ్ భరత్, బేతపల్లి MPTC ధనుంజయ, మాజీ సర్పంచ్ కృష్ణారావు, మాజీ పట్టణ అధ్యక్షులు నరేంద్ర చౌదరి, కరీడికొండ టీడీపీ నాయకులు ప్రభాకర్ నాయుడు, లాయర్ మల్లికార్జున, గుత్తి 15వార్డు జయన్న తదితరులు పాల్గొన్నారు.