కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు : తుంగభద్ర డ్యామ్ నుండి వృధాగా పోతున్న నీటిని, కుంటలకు, చెరువులకు మల్లించి, రైతుల సాగుకు అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ,కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని తుంగభద్ర ప్రాజెక్ట్ సబ్ డివిజన్ కార్యాలయం ముందు సిపిఐ నాయకులు ధర్నా చేపట్టారు. వృధాగా నిరుపోతున్న పట్టించుకోని LLC అధికారుల తిరును నిరసిస్తూ నినాదలు చేశారు. అనంతరం సిపిఐ పట్టణ కార్యదర్శి రంగన్న మాట్లాడుతూ తుంగభద్ర డ్యామ్ 19 వ నంబర్ గేటు కొట్టుకొని పోవడంతో డ్యామ్ నుండి నీరు వృధాగా సముద్రం పాలు అవుతుందని, దీని వాళ్ళ రానున్న రోజుల్లో రాయలసీమ ప్రాంతం మరింత కరువు ప్రాంతంగా మారబోతుందన్నారు. సుమారు 60 టిఎంసి నీరు దిగువన వృధాగా పోతుంటే LLC అధికారులు మాత్రం పట్టించుకోక పోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా LLC అధికారులు స్పందించి వృధాగా పోతున్న నీటిని గ్రామాల్లో ఉన్న నీటి కుంటలకు, చెరువులకు మళ్లించుకుంటే రానున్న రోజుల్లో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు లాభదాయకంగా ఉంటుందని సిపిఐ నాయకులు తెలిపారు.