- 15 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలింపు
మెదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ వాహనాల తనిఖీలో మాసాయిపేట గ్రామానికి చెందిన మోతే జనార్దన్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు పట్టుపడ్డాడు. దీంతో పోలీసులు జనార్దన్ విచారించగా చోరీ విషయం బయటపడింది. మాసాయిపేట గ్రామానికి చెందిన జనార్దన్ అతని స్నేహితులైన రేవల్లి లక్ష్మణ్, చింతల జగన్ అనే ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతున్నారు. పట్టుపడ్డ జనార్ధన్ నుండి 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు, వీటి విలువ సుమారు 5 లక్షల రూపాయలు ఉంటుందని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. నిందితుడు జనార్దన్ ని రిమాండ్ కి తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు.