తిరుపతి జిల్లా/ పాకాల మండలం: పాకాల దామలచెరువు ప్రధాన రహదారిలో ఊట్లవారిపల్లి శివారు రైల్వే గేటు దగ్గర గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకాల పోలీసులు తెలిపిన వివరాల మేరకు పులిచెర్ల మండలం, చెరువు ముందరపల్లి పంచాయతీ, కదిరయ్యచెరువు గ్రామానికి చెందిన నాగయ్య (65) తన వ్యక్తిగత పనుల నిమిత్తం టీవీఎస్ స్కూటరు పై పాకాల కు వస్తూఉండగా గుర్తుతెలియని కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు క్షత గాత్రుడు నాగయ్యను 108 వాహనంలో తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలించినట్టు తెలిపారు. పాకాల ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.