సంగారెడ్డి / పఠాన్ చేరు : స్వతంత్ర దినోత్సవ వేడుకలు మెట్రోరైల్ సాధన సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షులు సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ జండా ఆవిష్కరించారు. అనంతరం మెట్రోరైల్ సాధన సమితి సభ్యులతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మెట్రోరైలును పటాన్ చెరు వరకు కాకుండా కనీసం మియాపూర్ నుండి ఇస్నాపూర్ వరకు విస్తరించాలని అందుకు తగినవిధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ముఖ్యమంత్రి జిల్లామంత్రులతో పాటు స్తానిక ఎంపి ఎమ్మెల్యేలను కలిసి మెట్రోరైల్ సాధన సమితి తరపున ప్రజల డిమాండ్ ను వివరించి మెట్రో ను ఇస్నాపుర్ వరకు విస్తరించే విధంగా తమ కార్యాచరణ ఉంటుదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్, మెట్టుశ్రీధర్, రాజన్ సింగ్, వెంకటేష్, రామంజనేయులు, జంగయ్య పాపరాకు తదితరులు పాల్గొనడం పాల్గొన్నారు.