జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణం పాత బస్టాండ్ శాస్త్రి విగ్రహం వద్ద ట్రాక్టర్, ఆటో యూనియన్ ల గౌరవ అధ్యక్షుడు పూదరి నర్సాగౌడ్ ఆధ్వర్యంలో 78వ భారతస్వతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై చిరంజీవి,రాజులు హాజరై జెండా ఆవిష్కరించారు. జెండా పండుగ పురస్కరించుకొని యూనియన్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు.
