మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయి పేట్ గ్రామానికి చెందిన అచంపేట్ మహేష్ (26) దేవుని చెరువుకి స్నానానికి వెళ్ళి కాలుజారి నీటిలో పడి మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి కనిపింకపోవడంతో గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టగా నేడు మృతదేహం లభించింది. తండ్రి అచ్చంపేట వెంకటేష్ ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై బాలరాజ్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.