సంగారెడ్డి / పఠాన్ చేరు : రైతు ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో 60 లక్షల రూపాయల నిధులతో నిర్మించ తలపెట్టిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే మొట్టమొదటిసారిగా రైతులందరికీ రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా నిధులు సైతం విడుదల కాబోతున్నాయని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన గోదాములను నిర్మించబోతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ పాండు, మాజీకి సర్పంచ్ సుధీర్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ప్రసాద్ రెడ్డి, రాజు, నరసింహారెడ్డి, వెంకన్న, యాదయ్య, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.