ముంబయి మహానగరంలో చిత్తూరు జిల్లా శ్రీ బొమ్మరాజపురం గ్రామ సర్పంచ్ మరియు సర్పంచ్ల సంఘం రాష్ట్ర నాయకులు ఆర్. మణిరాజు కి చెందిన సినీ బి.ఎం. ఎక్స్ మల్టీప్లెక్స్ థియేటర్ ను పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, చిత్తూరు జిల్లా పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చుక్కా ధనుంజయ యాదవ్ లతో కలిసి పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు.ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన సర్పంచ్ మణిరాజు ఇతర రాష్ట్రాల్లో కూడా అది కూడా ముంబై మహానగరంలో వ్యాపారాన్ని విస్తరింప చేయడం అభినందనీయమని శ్రమ, చిత్తశుద్ధి ,క్రమశిక్షణ ల తోనే ఎటువంటి ఎదుగుదలైన సాధ్యమవుతుందని, అందుకు ఉదాహరణ సర్పంచ్ మణి రాజు అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సర్పంచ్ మణి రాజు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు.