అల్లూరి జిల్లా, హుకుంపేట: మండలంలో ఇసుక మాఫియా రోజరోజుకు రెచ్చిపోతోంది. రోజుకు వందల ట్రాక్టర్ల ఇసు కను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు మాత్రం అక్రమార్కులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అధికారబలంతో సంబంధిత అధికారులను శాసిస్తున్నారు. అనధికారికంగా ఇసుక తరలిస్తున్నారు అని తెలిసి రెక్కీ నిర్వహించి పట్టుకున్న పది నిమిషాల్లోనే ఆ ట్రాక్టర్ తమకు సంబంధించిన వ్యక్తిది వదిలేయ్ అని మండల నాయ కుల నుండి ఫోన్‌ల మోతమోగుతాయి. ‘కుదరదు అక్రమంగా ఇసుక తరలించడం నేరం’ అని అధికారులు బదులిస్తే వెంటనే ఎమ్మెల్యే నుంచి చెప్పించ మంటావా..? అంటూ గాండ్రిస్తారు…? ఎందు కంటే ప్రతి ఇసుక ట్రాక్టర్‌లో నాయ కులకు ఎంతోకొంత వాటా ఉంటుంది. దీంతో అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తు న్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది
తీగల వలస, సంపంగి పుట్టు , దిగుడు పుట్టు, హుకుంపేట మండల కేంద్రంలో తదితర ప్రాంతాల్లో గడ్డ వాగులు నుంచి ఇసుక పగలు సమయం డ్రంపింగ్ చేసి రాత్రి సమయం టిప్పర్లతో తరలిస్తున్నారు. టన్నుల కొద్ది ఇసుక అక్రమంగా తరలిస్తు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.