భద్రాచలం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో మరియు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ శుక్రవారం ఉదయం కరోనాతో మృతిచెందారు. మణుగూరు కరోనా క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న సమయంలోనే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవడంతో కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించినట్టు అధికారులు తెలిపారు.
కనికరం లేని కరోనా ఒక వీరుడ్ని బలితీసుకుందని జిల్లా కలెక్టర్ డా ఎంవి రెడ్డి తెలిపారు. ఇటీవలే వైద్య విద్యలో పీజీ సాధించిన నరేష్ కొన్ని రోజుల్లో ఉన్నత చదువులకు వెళ్లాల్సి ఉన్న సమయంలో వ్యాధితో మరణించడం చాలా దురదృష్టకరమని చెప్పారు. విధుల పట్ల అంకిత భావం కలిగిన యువ వైద్యుడ్ని జిల్లా ప్రజలు కోల్పోయారని, జిల్లాలో కరోనా కట్టడిలో డా నరేష్ సేవలు మరువలేనివని చెప్పారు. వారి కుటుంబ సబ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
నరేష్కుమార్ మరణంతో జిల్లా వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో తాము విధులు నిర్వహించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తమ కష్టాన్ని త్యాగాన్ని గుర్తించి అత్యవసర పరిస్థితిలో తప్ప అనవసరంగా బయటకి రావద్దని ఆలా చేయటం వాళ్ళ కరోనని కొంతైనా నివారించ వచ్చని జిల్లా ప్రజలని కోరుతున్నారు.
డాక్టర్ నరేష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించిన MLA పొదెం వీరయ్య గారు, 45 గతంలో తెలంగాణ ప్రభుత్వం ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిన విధంగా విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ సోకి వ్యాధిపై పోరాటం చేస్తూ అమరులైన వారికి కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా వెంటనే ప్రకటించాలని మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని MLA పొదెం వీరయ్య గారు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ వైద్యులు మరియు సిబ్బంది పై పని భారం తగ్గించేందుకు వెంటనే రెగ్యులర్ వైద్యుల పోస్టులు, స్టాఫ్ నర్స్ ల పోస్ట్ లు భర్తీ చేయాలని ఈ సందర్భంగా MLA కోరారు.