పల్నాడు జిల్లా పెదకూరపాడు గ్రామంలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల అభివృద్ధి నిమిత్తం పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఇప్పటికే లక్ష రూపాయలు అందించగా , అదే స్ఫూర్తితో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు గల్లా బాబురావు మాజీ ఎంపీపీ మంగళవారం రూ. 25 వేల రూపాయలు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అర్తిమల్ల రమేష్ చేతుల మీదుగా స్కూలు హెడ్మాస్టర్ కి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దుప్పటి బాలకృష్ణ, ఎస్.కే. భాష, మద్దినేని సత్యం, జాగర్లమూడి రఘు, బెల్లంకొండ రామ్ గోపాల్ రావు, భాష్యం ఆంజనేయులు, మండల తెలుగు యువత అధ్యక్షులు గల్లా శివ, నాగరాజు, షేక్ ముంతాజ్ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి షేక్ అజిముల్లా క్లస్టర్ ఇంచార్జి షేక్ రఫీ పాల్గొన్నారు.