దళితుణ్ని బహిరంగంగా కాలుతో తన్నిన సిఐ వేణుగోపాల్ ను సస్పెండ్ చాలదు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి
శ్రీకాకుళం జిల్లా పలాస టెక్కలి గ్రామ దళితుడు జగన్ ను సిఐ వేణుగోపాల్ బహిరంగంగా కాలుతో తన్నడం సిగ్గు చేటు అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవీపియస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అన్నారు. సి ఐ వేణుగోపాల్ ను సస్పెండ్ చాలదు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పలాస మండలం టెక్కలి పట్టణం గ్రామంలో జగన్ ( దళిత) ప్రభుత్వం పేదలకు పంపిణీ చేయనున్న ఇల్లు స్థలాలు పేదలకు ఇవ్వండి అని అదే గ్రామానికి చెందిన హనుమంతు వైకుంఠరావు అడుగుతుండగా ముల్లవంకాయల రమేష్ (రిటైర్ ఆర్మీ) అనే వ్యక్తి జగన్ పై దాడి చేశాడు. చుట్టువున్న రమేష్ బందువులు జగన్ పై దాడి చేశారు . ఈ రోజు ఉదయం మల్లి వీధిలో వెల్లుతున్నా జగన్ దళిత వ్యక్తి పై మరల దాడి చేశారు. ఈ ఘటనపై పలాస పోలీసు స్టేషన్ లో జగన్ పిర్యాదు చేశాడు. అధికార పార్టీ నాయకులు జోక్యం వుండటంతో సిఐ వేణుగోపాల్ జగన్ ని బహిరంగంగా కాలుతో తన్ని చేతితో కొట్టారు. ఇరువర్గాలను రాజీచేసి పంపించారు.
రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సిఐ వేణుగోపాల్ ను సస్పెండ్ చేసినట్లు ఉపముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే దుర్మార్గం గా దళితుడు జగన్ కాలుతో బహిరంగంగా తన్నిన సిఐపై సస్పెండ్ చాలదు . అతను పైన మరియు గ్రామంలో జగన్ ని కొట్టిన అగ్రకుల పెత్తందార్లు పై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జగన్ కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరుతున్నాము