- తవ్వే కొద్దీ వెలుగుచూస్తున్న మైనింగ్ మాఫియా లీలలు.
- సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు.
మదనపల్లి : మైనింగ్ మాఫియా లీలలు తవ్వే కొద్దీ బయట పడుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పౌర హక్కుల సంఘం నాయకులు పి.నాగేశ్వరరావు, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి, సీఐటీయూ నాయకులు హరిశర్మ లతొ కలసి మాట్లాడారు. ట్రాక్టర్లు, చిన్న చిన్న ఇంటి నిర్మాణాలు చేసఉకునె ఇంటి యజమానులు ఇసుక దొరక్క ఇబ్బందులు పడుతుంటే మాఫియాలో భాగస్వామ్యం ఉన్న వారు ఇసుకను కుప్పలు, కుప్పలుగా పొగేసుకుని లాభాలు గాడిస్తున్నారని అన్నారు.బహుదా కాలువను సైతం ఆక్రమించి ఇసుకను కొల్లగొట్టుతున్న ఘనులు మదనపల్లిలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చూపించిన 10 ఇసుక అక్రమ నిల్వ కేంద్రాలు, 2 మట్టి అక్రమ నిల్వ కేంద్రాలు చూపించినామని, ఒక్క చోట మాత్రమే ఇంటి నిర్మాణానికి తోలుకున్నామంటూ వచ్చారని, అదికూడా అనేక అనుమానాలు ఉన్నాయని, ఒక్క చోట మాత్రమే ఇసుకను సీజ్ చేశారని, మిగిలిన చోట్లకు అధికాలు కన్నెత్తి కూడా చూడలేదని అన్నారు. మెయింగ్ మాఫియాతో అంటకాగుతున్న నేతలు సిపిఎం పై బురదజల్లడం మానుకుని, ప్రజలకు అండగా ఉండి బురద పడకుండా చూసుకోవాలని హితవు పలికారు. మైనింగ్ మాఫియా పై సమగ్ర విచారణ జరిపించాలని, సంబంధం ఉన్న అందరిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సిపిఎం చూపిన ఇసుక, మట్టి ని ప్రభుత్వ గృహ నిర్మాణాలు చేసుకునే పేదలకు సరఫరా చెయ్యాలని డిమాండ్ చేశారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని అన్నివర్గాల ప్రజకు ఉపయోగ పడే ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం సామాన్య ప్రజలకు తీవ్ర కష్టంగా ఉండని అన్నారు. సిపిఎం చేస్తున్న ఇసుక మ్మాఫియాపై పోరాటానికి సంగీభావం ప్రకటించారు. ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తి మాట్లాడుతూ ఇసుక అక్రమ నిల్వలు కనిపెట్టి అక్కడి నుండి ఫోన్ చేసినా స్పందించని తహసీల్దారు మాఫియా కనుసన్నల్లో ఉండటం దుర్మార్గం అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మైనింగ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ నాయకులు హరిశర్మ మాట్లాడుతూ ఇసుక దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, కార్మికులకు ఉపాధి లేకుండా పోతోందని అన్నారు. ఉచిత ఇసుక సైట్ ఓపెన్ కాకపొయినా బడా బాబులకు, ఇసుక వ్యాపారులకు లక్షలు కురిపిస్తోందని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి నిర్దిష్ట ఆధారాలతో ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పడంలో విఫలం అయ్యి వ్యక్తిగత దూషణ చేయడం రాక్షస చర్య అన్నారు. మైనింగ్ మాఫియా అరికట్టక పోతే అప్రతిష్ట పాలైయ్యేది అధికార పార్టీనే అని హెచ్చరించారు.