మదనపల్లి :నేడు నిమ్మనపల్లి మండలం రాచవేటి వారి పల్లి లో సర్పంచ్ మధు ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభ కు రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపన ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని గతంలో సర్పంచిని ఉత్సవ విగ్రహాలుగా మార్చి నిధులు ఇవ్వకుండా చిన్నచిన్న పనులు చేసుకోలేని పరిస్థితిలు ఉండేవని అయితే ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ అధికారం చేపట్టిన తర్వాత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు చిన్న పంచాయతీలకు పదివేలు, పెద్ద పంచాయతీలు 25వేల రూపాయలు చొప్పున కేటాయించాలని, గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతి పంచాయతీకి 20 లక్షల రూపాయలు,సిసి రోడ్లు వేసుకోవడానికి కేటాయించాలని, 850 కోట్లు గ్రామపంచాయతీలకు పాత బకాయిల నిధులు చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు.ప్రజలందరూ భాగస్వాములై మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు కావలసిన పనులు సమకూర్చుకోవాలని ఇందులో పంట కాలువలకు, ఇంకుడు గుంతలకి, పండ్లతోట పెంపకానికి, గొర్రెలు ఆవుల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం సబ్సిడీ మంజూరు చేస్తుందని గుర్తుచేశారు. రైతులందరూ విరివిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఇసుకను విచక్షణ రహితంగా ఎక్కడపడితే అక్కడ తవ్వకుండా కట్టడాలకు మోరీలకి 100 మీటర్ల దూరంలో ఇసుకను తీసే విధంగా ప్రజలు అప్రమత్తతో మెలగాలని యువకుడైన వ్యక్తి షాజహాన్ భాష మనకు ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టమని, ప్రతి చిన్న సమస్యను ఆయన పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలందరితో మమేకమై త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డి ఈ, నిమ్మనపల్లి ఎంపీడీవో, అగ్రికల్చర్ ఏఈ, ఉపాధి హామీ ఏపీఎం,గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున,వెంకటరమణ,నరసింహారెడ్డి, మనోహర్ రెడ్డి,భద్ర, శివకృష్ణ,శంకర మరియు ప్రజలు పాల్గొన్నారు