మదనపల్లి :మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రమైన నిమ్మనపల్లిలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మహిళా సంఘాల సభ్యులకు రూ.3 కోట్ల చెక్కును అందజేశారు.ఎమ్మెల్యేతో పాటు టిడిపి రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జె వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వాలంబన కోసం కేంద్ర ప్రభుత్వం లక్పతి దీదీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఇందులో భాగంగా చిన్నపరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రుణాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.అనంతరం ఆర్.జె.వెంకటేష్ మహిళలను మహారాణులను చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలు అన్నిరంగాల్లో రాణించేందుకు అనువుగా పథకాలను ప్రవేశపెడు తున్నారన్నారు.మహిళలను స్వయం ఉపాధి వైపు నడిపించడమే లక్పతి దీదీ పథకం యొక్క ఉద్దేశ్యమని ఆయన వెల్లడించారు.ఈ పథకాన్ని మహిళలు అందరూ సద్వినియోగం చేసుకొని సమాజంలో ముందంజ వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రమణ,మాజీ మండలాధ్యక్షుడు రెడ్డెప్ప రెడ్డి మరియు టిడిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.