జగిత్యాల జిల్లా ,మెట్ పల్లి : మహారాష్ట్ర నుండి RTC బస్సుల కార్గోలో గాంజాయిని జగిత్యాల జిల్లాలో అమ్మకానికి తెస్తున్నారని పక్క సమాచారంతో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్ పల్లి బస్టాండ్ తో పాటు పరిసర ప్రాంతాలలో DSP ఉమామహేశ్వర్ రావు అద్వర్యంలో CI నిరంజన్ రెడ్డి మరియు SI లు చిరంజీవి, అనీల్ కిరణ్ కుమార్, రాజు మరియు ఇతర పోలీస్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా DSP ఉమామహేశ్వర్ రావు మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు గూరి కాకుండా ఉండటానికి గొరిజాయిని పూర్తిగా నిర్మూంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పట్టనంలో యువత ఆసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గంజాయి, సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని అన్నారు. స్వీయ రక్షణ కొరకు సి.సి. కెమెరాలు అమర్చుకోవాలని అందుకు పోలీసుల సహకారం ఉంటుందని చెప్పారు. నేరాల నియంత్రని లో సీ.సి. కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కొత్త చట్టాల ప్రకారం కఠినశిక్షలు ఉంటాయని హెచ్చరించారు.