contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్ హుకుంపేట

  • ఐటీడీఏ పీవో అభిషేక్, ఎస్డిసి శర్మ ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
  • నిద్ర మత్తులో హుకుంపేట రెవెన్యూ అధికారులు

 

అల్లూరి జిల్లా హుకుంపేట : మండలకేంద్రంలో భినామీలు,రెవెన్యూ అధికారులు కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలు గిరిజనేతరులు చేపడుతున్నారు. గిరిజనేతరులకు రెవెన్యూ అధికారులకు గిరిజన భినామీల మధ్య వర్తిత్వంతో జరిగిన చీకటి ఒప్పందాలే ఇందుకు కారణమని గిరిజనులు వాపోతున్నారు. గిరిజన హక్కుల, చట్టాలు సైతం బెకాతరు చేసి దర్జాగా నిర్మాణాలు సాగిస్తున్నారు. అధికారులు అటువైపుగా కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. సర్వహక్కులు కలిగిన గిరిజనులు చిన్న గుడిసె వేసుకుంటే అగమేగాల మీద జెసిబిలతో కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు,సక్రమ నిర్మాణాలతో ఇక్కడ అధికారులకు పనిలేదు. వారికి అందాల్సింది సమకురిటే అన్నీ సక్రమాలే అంటున్నరు పలువురు గిరిజనలు. ఇది ముమ్మాటికీ చీకటి

ఒప్పందమే! అక్రమ నిర్మాణాలకు కేరాఫ్? అడ్రస్ హుకుంపేట మండల కేంద్రంగా మారిపోయింది. రోజురోజుకూ అక్రమ నిర్మాణాలు పెరిగి పోతున్నా అడ్డుకునే నాథుడే లేకపోవడంతో అడ్డు అదుపు లేకుండా పోయింది ఇక్కడి మైదాన వాసులకు. దీంతో వారు ఆడిందే ఆట. పాడిందే పాట అయిపోయింది. ఇటీవలి కాలంలో గిరిజన సంఘం నాయకులు అక్రమ నిర్మాణాలపై అల్లూరి జిల్లా కలెక్టర్, పాడేరు ఐటిఐ పిఓ, ఎస్డిసి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నుంచి ఎప్పటి వరకు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అని తెలిపారు.
సోమలింగం, షాకెలి కళ్యాణం ,అలి మహమ్మద్. సంతోష్, బుద్దేకు, కొండమ్మ, కస రాజు, షేక్ వహీద్, దొడ్డి, ప్రసాద్, షేక్ భాష,కొరిబిల్లి ప్రవీణ్ 6 నుంచి 10 షాపులు, ఇండ్లు కట్టుకొని తిరిగి గిరిజనులకు అద్దెలకుఇచ్చి సొమ్ముచేసుకొంటున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని

పంచాయితీ అధికారుల దగ్గరనుంచి జిల్లా కలెక్టర్ దాకా పిర్యాదులు చేసినా కనీసం స్పందించడం లేదు సరికదా వాటికి మూడింతల అక్రమ నిర్మాణాలు పెరిగి పోయిందని గిరిజనులు వాపోతున్నారు. ఎది ఏమైనా ఇది ఇలాగే కొనసాగితే భవిషత్ ఆదివాసీ సమాజానికి మిగిలేది శూన్యమే అంటున్నారు.గిరిజన భినామి నిర్మాణాలపైన ఉవ్వెత్తున ఉద్యమం చేపట్టి అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలు పై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గిరిజన ప్రజలంతా ఐక్యమై తొలగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :