ప్రకాశం జిల్లా / చీమకుర్తి : 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ స్వతంత్ర భారతదేశంలో దళితుల పట్ల ఇంకా పక్షపాత ధోరణి మారలేదు. చట్టసభల్లో దళితులు పలు రకాల పదవులను అలంకరించి పలు రకాల సంస్కరణలకు పెద్దపీట వేస్తూ తీర్పులు వెల్లడించిన , దళితులు అంటే ఎక్కడో ఒకచోట చులకన భావం ఉంటూనే ఉంది.
వివరాల్లోకి వెళితే చీమకుర్తి మండలం పల్లామల్లి మాదిగ పల్లెని ఆనుకొని ఉన్న స్మశానం .. ఆ గ్రామం అగ్రకులాల వారికి స్మశానం ఎక్కడో ఊరి చివర ఉందంటే పొరపాటు పడ్డట్టే. దళితులు నివాసం ఉండే మాదిగ పల్లె నీ అనుకొని ఉంటుంది.
నివాస గృహాలకు స్మశానానికి రోడ్డు గ్యాప్ మాత్రమే ఉన్న ఈ స్మశానం వలన అక్కడి దళితులు పసిబిడ్డలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. మృత దేహాలను దహనం చేసినప్పుడు గాలి ప్రభావం వలన శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు అక్కడ పసిపిల్లలు బలైపోతున్నారు.
నివాస గృహాల మధ్యలో మృతదేహాలను పూడ్చి పెట్టడం, దహనం చేయటం అంటే కార్యక్రమాల వల్ల పెద్దలకు పిల్లలకు ఎన్నో మానసిక, ఆరోగ్య సమస్యలు వెల్లువెత్తుతున్నాయని కాలనీవాసులు ఆరోపించారు. అంతేకాక పెద్దవారిలోనూ అనేక రకాల మానసిక సమస్యలు కూడా వెలువెత్తుతున్నాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా వారి యొక్క పరిస్థితి మారకపోవడంతో కాలనీ వాసులు నిరసనకు దిగారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.