- సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ ప్రారంభించిన సిఐడి..
- నేరస్తుల గుండెల్లో పరిగెడుతున్న రైళ్ళు
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసు మరుగున పడింది అనుకుంటున్న తరుణంలో సోమవారం సిఐడి అధికారులు రంగంలోకి దిగడంతో మళ్లీ అలజడి మొదలైంది. సబ్ కలెక్టరేట్లో సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యాన్నార్, అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్, సిఐడి డిఎస్పీ వేణుగోపాల్, మదనపల్లె డిఎస్పి కొండయ్య నాయుడు, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో రికార్డులను పరిశీలిస్తున్నారు.. రాత్రి నిమ్మనపల్లి వీఆర్ఏ రమణయ్యతో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న గౌతమ్ తేజ్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు మళ్లీ తోడి ఎక్కడ తమ గొంతుకు ఉరి బిగిస్తారోనని ఫైళ్ల దగ్ధం కేసులో ఉన్న నిందితులతో పాటు ఆ కేసులో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురి నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిఐడి రంగంలోకి దిగితే ఫైళ్ల దగ్ధం కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మరుగున పడిపోయిందనుకున్న కేసు తిరిగి లోడుతుండడంతో ఒక్కొక్కరి బాగోతాలు బయట పడనున్నాయి. ఇప్పటికే రెండు లక్షల పదహారువేల ఎకరాలు ఫ్రీ హోల్డ్ జిల్లాలో అయ్యాయని రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియానే నేరుగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇప్పటివరకు ఈ కేసులో మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో పాత ఆర్డిఓ లు మురళి, హరి ప్రసాద్, మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష, రైస్ మిల్ మాధవరెడ్డి, మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింక వెంకటా చలపతి, రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి రమణారెడ్డిలతో పాటు మరికొందరు పై కేసులు నమోదు విషయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్ నెలరోజుల కాకముందే మీడియా ఎదుట బహిర్గితం చేశారు. ఇప్పుడు మళ్లీ సబ్ కలెక్టర్ కేసు దర్యాప్తును పున ప్రారంభించడంతో నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టుకుంది.