ఒంగోలు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి , మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడనున్నారా, రాజకీయాలకు స్వస్తి చెప్పనున్నారా అనే అనుమానాలు పార్టీ క్యాడర్లో రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం చెందడం, బాలినేని మునుపెన్నడూ లేని విధంగా చాలా తక్కువ ఓట్లు నమోదు అవ్వడం, తన పదవీకాలంలో తన సొంత పార్టీ నేతలే తనపై అవినీతి ఆరోపణలు చేయడం వంటి పలు కారణాలవల్ల తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యారు.
అంతేగాక ఒంగోలు నగర పాలక మేయర్ గంగాడ సుజాత 12 మంది కార్పొరేటర్లతో టిడిపిలో చేరడం, అందులో బాలినేని ముఖ్య అనుచరులైన వారు కూడా పార్టీని వీడటం వంటి ప్రధాన కారణాలవల్ల బాలినేని రాజకీయాల నుండి వైదొలగనున్నారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈవీఎంల రి వెరిఫికేషన్ సమయంలో, పార్టీ నుంచి గాని, అధినాయకత్వం నుండి గాని ఎటువంటి సపోర్ట్ లేనందువలన ఏర్పడిన నిరసత్వం.
ఇదిలా ఉండగా జిల్లాలో పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండకుండా నిత్యం హైదరాబాదులో ఉంటూ కూటమి నేతలతో పార్టీ మారే దిశగా మంతనాలు చేయడం, వారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పార్టీలో చేర్చుకోకపోవడం వంటి కారణాలు వల్ల రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పనున్నారని పార్టీ క్యాడర్ ఇంకా తమ అనుచరులలో అనుమానాలు రేకెత్తుతున్నాయి.