ఒంగోలు యొక్క అభివృద్ధి, తెలుగుదేశం పార్టీ తోటే సాధ్యపడుతుందని వైసీపీని వీడి టిడిపిలోకి చేరిన ఒంగోలు నగరపాలక మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సత్యనారాయణ (బుజ్జి), 12 మంది కార్పొరేటర్లు కలిసి నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని గురువారం వెలగపూడి లోని సచివాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధి ధ్యేయంగా మీరంతా వైసీపీని వీడి టిడిపిలోకి చేరడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని, ఇటీవల పార్టీలో చేరిన వారిని కలుపుకుంటూ పోవాలని, ఒంగోలు అభివృద్ధికి తోడ్పడాలని దామచర్ల జనార్ధన్ కు సూచించారు.
ఒంగోలు నగరానికి సంబంధించి యువ గళం పాదయాత్రలో నారా లోకేష్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,మరియు మరికొన్ని అభివృద్ధి పనుల హామీకి సంబంధించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు ఒంగోలు నగర టిడిపి ,జనసేన , వైసిపి కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.