భారీ వర్షాలు, వరదలపై అధికారులతో శనివారం నాడు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సమీక్షించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ, కలెక్టర్ , రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల, సంక్షేమ వసతి గృహాలఉన్నతాధికారులతో మాట్లాడారు. భారీ వర్షాల నేపద్యంలో జిల్లాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీకి సూచించారు. గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని జిల్లా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.అధికారులంతా అందుబాటులో ఉండాలని, ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని మంత్రి అన్నారు.