కరీంనగర్ జిల్లా: గత రెండు రోజులుగా కురుస్తున్న వానలతో ఓర్రెలు పారి కుంటలు, చెరువులు నిండు కుండలా మత్తడ్లు దూకి వాగులు ఆదివారం ఉప్పొంగి పొర్లుతున్నాయి. గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి కొండాపూర్ గ్రామాల మధ్య ఉన్న దేవుని చెరువు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి గన్నేరువరం పెద్ద చెరువు చొక్కారావుపల్లి కు వెళ్లే రోడ్డు వరద నీటి ప్రవాహానికి రోడ్లు దాటకుండా రైతులకు వాహనాదార్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం రాత్రి 9:30 గంటలకు కరీంనగర్ నుండి ఆర్టిసి బస్సు బయల్దేరి గన్నేరువరం పెద్ద చెరువు వద్ద భారీ వరద నీరు రావడంతో చొక్కారావుపల్లెలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. ప్రయాణికులు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ బస్సు లోనే భోజనం చేసి నిద్రించారు. చొక్కారావుపల్లి గ్రామానికి చెందిన కాంపెల్లి శేఖర్ మాట్లాడుతూ గన్నేరువరం – మైలారం బస్సు మత్తడి జోరుగా రావడంతో రాత్రి ఆర్టిసి బస్సు నిలిచిపోయి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిందన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మత్తడి వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు అయితున్నప్పటికీ ప్రభుత్వాలు మారిన ప్రజా ప్రతినిధులు మారిన సమస్య పరిష్కరించలేకపోతున్నారు. త్వరగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ తీసుకొని వెంటనే గన్నేరువరం పెద్ద చెరువు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజల తరఫున కోరుతున్నాడు.