అనంతపురం జిల్లా గుత్తి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నల్లాని కేశవ నాయుడు గారి సతీమణి. ఎన్ సుజాతమ్మ ఆదివారం తమ గృహములో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గుంతకల్లు శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు గుత్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ కేశవ నాయుడు గృహానికి వెళ్ళి వారి భార్య భౌతిక కాయనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో గుత్తి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు.