కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామంలోని దళిత కాలనీలో డ్రైనేజ్ కురుకపోయి నీళ్లు నిలవడంతో అధికారులతో కలిసి దెబ్బతిన్న రోడ్లను డ్రైనేజీని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. వెంటనే డ్రైనేజీలో కూరుకుపోయిన చిత్తను తొలగించి వర్షాలు తగ్గిన తర్వాత సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా చీమలకుంటపల్లి గ్రామంలో పర్యటించి తుమ్మనిపల్లి, చీమలకుంటపల్లి గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను కల్వర్టు ను అధికారులతో కలిసి పరిశీలించి నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ యూత్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, నాయకులు బేతేల్లి రాజేందర్ రెడ్డి, తాళ్లపెళ్లి శ్రీనివాస్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.