contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వరద బాధితులకు బాసటగా నిలిచిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

  • శ్రీ మాస్టర్ మైండ్ విద్యాసంస్థల సహకారంతో అన్నార్తులకు భారీగా భోజనాలు పంపిణీ చేసి బాసటగా నిలిచారు.

 

పల్నాడు జిల్లా ,అచ్చంపేట:  తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అచ్చంపేట వీరభద్ర కాలనీ వరద బాధితులకు ఎమ్మెల్యే సహకారంతో అన్నార్తులకు 1000 భోజన ప్యాకెట్లు 2000 వాటర్ బాటిళ్ల వాహనాలకు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తన కార్యాలయం నుండి పచ్చ జెండా ఊపి పంపించడం జరిగింది .

ఈ సందర్భముగా భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ…. అకాల వరద భీభత్సానికి పెదకూరపాడు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు మునిగిపోవటం, వరదల్లో ఉండటం బాధాకరమని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎప్పటికప్పుడు సహాయ కార్యక్రమాలు జరుగుతున్నాయని, స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో ప్రజలకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీయేనని, సమర్దుడయిన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గత 4 రోజుల నుండి విజయవాడలోనే ఉంటూ సహయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారని తెలియజేశారు.

నియోజకవర్గ ప్రజలు ఎవరు కంగారుపడవద్దని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ భరోసా కల్పించారు. మంత్రి నారా లోకేష్ పిలుపుతో టీడీపీ, జనసేన,బీజేపీ కార్యకర్తలు వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో అచ్చంపేట మండల తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం, మట్ట వీరభద్రం, పంచాక్షరి హనుమంత ఆచారి,తెలుగుదేశం మండల క్లస్టర్ ఇంచార్జ్ బత్తుల శ్రీనివాసరావు ,సీనియర్ నాయకులు రాయుడు సాంబశివుడు, తిరువాయిపాటి ఆంజనేయులు ,తోట శ్రీనివాసరావు కొమ్మవరపు దిబ్బయ్య, షేక్ ఆదం షఫీ, కోట చంటి, వెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :