అనంతపురం జిల్లా పెద్దవడుగూరు రూరల్ సర్కిల్ నూతన సిఐగా రామసుబ్బయ్య బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిబద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మధ్యం, గంజాయి, అక్రమణ ఇసుక రవాణ తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానులేనని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.