తిరుపతి జిల్లా, పాకాల మండలంలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఘణంగా గురుపూజోత్సవాన్ని పాకాల లైన్స్ క్లబ్ ప్లాటినం వారిచే “ఉత్తమ ఉపాధ్యాయులు” 10 మందికి పాకాల గవర్నమెంట్ హైస్కూలు నందు పాఠశాల హెచ్ఎం మహ్మద్ రఫీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాకాల లైన్ ప్రెసిడెంట్ కె.యస్. తులసీరామ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజములో విద్యా అభివృద్ధి ఎనలేని కృషి చేశారని వారు చేసిన సేవలను కొనియాడారు. అదేవిధంగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా వారు చేసిన సేవలు, విద్యార్థులను మంచి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దిన విధానాన్ని కొనియాడారు.
లైన్స్ సభ్యులు మాజీ కాలేజీ ప్రిన్సిపల్ యస్.దామోదర్ నాయుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులు యొక్క సేవ విశిష్టతను తెలియచేసారు. లైన్ టి.జయరాంనాయుడు, లైన్ ఎం. కుప్పుస్వామి నాయుడు లైన్ రామయ్య మాట్లాడుతూ సమాజంలో సేవ లైన్ క్లబ్ ద్వారా ఎలా నిర్వహిస్తారో వివరించారు. సన్మాణ గ్రహీతలకు సన్మాణము చేసి మెమొంటోలని ఇచ్చి దుశ్యాలువ కప్పి, పూలమాలలు వేసి సత్కరించారు.
ఈ కార్యక్రమములో డాక్టర్ మోహన్ బెహరా, వి. ఉమామహేశ్వరి, టి. హరినాథ్ రెడ్డి, డి. భరత్ కుమార్, ఎ.సరస్వతి. లైన్ జి.రామయ్య, జి. ఆంజనేయులు, కె.సుబ్రహ్మణ్యం, వి. శోభా రాణి, బి.సుజాత పాల్గొన్నారు.