కార్గిల్ సమీపంలోని గల్వా న్కు 100 కిలోమీటర్ల దూరంలో శనివారం బాంబులు నిరీర్యం చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ బాంబు పేలిపోవడంతో ఉమామహేశ్వరరావు వీరమరణం పొందారు. ఈ ఘటనపై ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాయితీయ అధ్యక్షులు వి. సుధాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కీర్తించారు. సంతోష్ త్యాగం వెలకట్టలేనిదని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.