జగిత్యాల కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గౌరవ డాక్టరేట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గ్రహీత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు డాllగుర్రం దయాకర్
గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో వినాయకులను తయారు చేస్తుంటాడు
గణనాధుని కృప కటాక్షం నా పైన ఉండడం వల్లనే ఇలాంటి ఆలోచన వచ్చింది అన్నారు
ఒక్క గరకపోస చాలు ఆ గణనాధుని పూజించడానికి
బంగారం వజ్ర వైడూర్యాలు మనీ మాణిక్యాలు అన్నిటికన్నా ఇష్టమైనది ఆ గణనాధునికి ఆ గరకపోస అలాంటి గరకపోసపై గణనాధుని విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టం
ఈ విగ్రహం తయారు చేయడానికి ఒక గరకపోస మైనం వాటర్ కలర్స్ తయారీకి 10 గంటల సమయం పట్టింది అన్నారు
అలాగే ఇంతకుముందు బంగారు గణపతి మట్టి గణపతి పసుపు గణపతి చంద్రయాన్3 గణపతి చేశాను అని తెలిపారు.