ప్రతి సోమవారం ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్, మండల స్థాయిల్లో నిర్వహించే “మీకోసం ” కార్యక్రమాన్ని ఈనెల తొమ్మిదవ తేదీ సోమవారం నాడు తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రకటించారు.
వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు, సిబ్బంది విజయవాడ వెళ్లారని, ఈ నేపథ్యంలో ” మీకోసం ” కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలు రావద్దని కలెక్టర్ సూచించారు.