అనంతపురం జిల్లా గుత్తి ఆర్ ఎస్ లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాయలసీమ నాణెముల సేకరణ సంఘం వారి తరుపున నాణెముల ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ప్రపంచ దేశాల నాణెములు నోట్లు వివిధ రాజుల కాలం నాటి పురాతన నాణెములు ప్రదర్శనలో ఉంచారు. పుర ప్రజలు విద్యార్థినీ, విద్యార్థుల విజ్ఞానము కొరకు క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం వరకు వినియోగంలోని నాణెములతో పాటు ఇండో గ్రీకులు, ఇండో ససానియన, కోటి లింగాల నాణెములు, శాతవాహనులు, ఇక్చ్వాకులు, సెబకరాజులు, హిరణ్యక, ఆనంద గోత్రికులు, గుప్తులు, విష్ణుకుండీనులు, మగదరాజులు, పల్లవులు, చోలులు, ఉజ్జయిని రాజులు, జునాఘడ్, విజయ నగర సామ్రాజ్య నాణెములు, హో్యాసలాలు, అక్బర్, అల్లా ఉద్దీన్, కిల్జీ, షాజహాన్, ఔరంగాజెబు, తిప్పు సుల్తాన్, మైసూర్ రాజులు, డచ్చి నాణెములతో పాటు సుమారు 250 దేశాలకు పైగా నాణెములు, ప్రపంచం దేశాల నోట్లను ప్రదర్శనలో ఉంచి ప్రజల, విద్యార్థుల నుండి మన్ననలు పొందరు.
ఈ కార్యక్రమంలో కె హెచ్ నాగరాజా రావ్ ధర్మవరం, విష్ణుభగవాన్ తాడిపత్రి, సదా శివారెడ్డి ప్రొద్దుటూరు, రంగనాథ్ కడప, రాజేష్ రెడ్డి కర్నూల్, సంజీవ్ కర్నూల్ మరియు శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి సభ్యులు, ఉపాధ్యాయులు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.