పల్నాడు జిల్లా / గారపాడు/ పెదకూరపాడు : గారపాడు గ్రామంలో డయల్ యువర్ ఎమ్మెల్యే గోడ ప్రతులను గురువారం ఆవిష్కరించారు.
పాలనలో వైవిద్యం.. అవినీతి రహిత పరిపాలన ధ్యేయంగా … పెదకూరపాడు ప్రగతికి కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యంగా పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పాలనలో నూతన వరవడికి శ్రీకారం చుడుతూ ఎమ్మెల్యే తీసుకొచ్చిన డయల్ యువర్ ఎమ్మెల్యే ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మక్కెన సాగర్ అన్నారు.
సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుముచ్చు రామారావు, కూటమి పార్టీ కార్యకర్తలతో కలిసి డయల్ యువర్ ఎమ్మెల్యే గోడ ప్రతులను ఆవిష్కరించారు… ఒక్క ఫోన్ కాల్ తో ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయన్నారు.