గుంటూరు జిల్లా కారంపూడి పట్టణంలో మళ్ళీ కరోనా కలకలం రావడంతో పట్టణ మండల.ప్రజల్ని ఊదేశించి కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ గారు మాట్లాడారు పట్టణ మరియు మండల ప్రజలు ఒకోక్కరూ 6 నుంచి 7 అడుగుల దూరం సామాజిక దూరం పాటించాలని లాక్ డౌన్ సమయంలో కారంపూడి కి పాజిటివ్ వచ్చిన తరుణంలో పట్టణ మండల ప్రజలు అందరూ ఎలా సహకారం అందించి పాజిటివ్ వచ్చిన పట్టణాన్ని కూడా కరోనా( జీరో) నెగిటివ్ గా మార్చిన రోజుల్ని గుర్తుచేస్తూ కరోనా ని మహమ్మరిని మరోసారి మన మండలం నుంచి తరిమితరిమి కొట్టాలని మండల ప్రజలు ఎవరికి వారే స్వచ్చందంగా సామాజిక దూరం పాటిస్తూ షాప్ లకి దుకాణాలకు వచ్చిన వారిని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరూ మాస్క్ శానిటైజర్ లాంటివి ఉండాలని ప్రభుత్వం చేస్తున్న కరోనా పై పోరాటంలో తమకి ప్రజలు సహకరించాలని నిర్లక్ష్యంగా వ్యవరించిన వారిపై తీవ్రస్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకొనబడునని ప్రజల యోగక్షేమంకొరకు మన గ్రామాన్నీ మన మండలాన్ని గురించి మనమే జాగ్రత్హలు తీసుకోవాలని దీనికి ప్రజలు కచ్చితంగా సహకారం అందించాలని కారంపూడి ఎస్ ఐ గల్లా రవికృష్ణ తెలిపారు