పెదకూరపాడు మండలం పాటిబండ్ల నుండి నియోజకవర్గం కేంద్రమైన పెద్దకూరపాడు కి వచ్చే రహదారి వెంబడి 11 కెవి కరెంటు స్తంభాలు సుమారు 20 పూర్తిగా వంగిపోయాయి. గత ప్రభుత్వ నాసిరకం పనుల వలన ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా కిందపడే పరిస్థిలో ఉన్నాయి. ప్రభుత్వం మారిన అధికారుల పనితీరు ఏమాత్రం మారలేదని ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.