- జిల్లా పార్టీ బాధ్యతలు స్వీకరించమని అడిగిన అధినేత జగన్ ఆదేశాలను పాటించని బాలినేని.
- పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో బాలినేని.
- అనుచర వర్గానికి సమాచారం ఇచ్చిన బాలినేని .
- ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలే ప్రధాన కారణం.
ప్రకాశం జిల్లా వైసీపీలో తీవ్ర అసమ్మతి ఏర్పడింది. అధినేత జగన్ జిల్లా పార్టీ బాధ్యతలను స్వీకరించమని కోరిన మాజీ మంత్రి ఖాతరు చేయలేదు. దీనికి గల కారణం 2024 సార్వత్రిక ఎన్నికలలో పలు కారణాలవల్ల జిల్లా కేంద్రమైన ఒంగోలు నియోజకవర్గం వైసిపి ఘోర ఓటమి చవి చూడటం.
అర్ధాంతరంగా మంత్రి హోదా నుండి తప్పించడం, ఒంగోలు పట్టణ ప్రజలకు ఇస్తామన్న ఇళ్ల పట్టాలను మంజూరు చేయకపోవడం,సొంత పార్టీ నేతలు తనపై అవినీతి ఆరోపణలు చేయడం, జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ కి తన అనుమతి లేకుండా కొత్త వ్యక్తిని తీసుకుని రావడం వంటి కారణాలవల్ల జిల్లాల పార్టీలో తన మాటకు ఉన్న బలం తగ్గిందన్న భావన.
దానికి తోడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈవీఎంల లో అవకతవకలు జరిగాయని హైకోర్టు లో పిటిషన్ వేసిన అధిష్టానం నుండి ఎటువంటి సహకారం లభించకపోవడం, మేయర్ తో పాటు తనకు నమ్మకస్తులైన కార్పొరేటర్లు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం వంటి కారణాలవల్ల తనకు ప్రాధాన్యత తగ్గిందని వెల్లడించారు.
బాలినేని సన్నిహితుల సమాచారం మేరకు త్వరలో పార్టీని వీడనున్నారనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి.
వారి అనుచర వర్గం కూడా బాలినేని ఏ పార్టీలో చేరతారు.. అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారని చెబుతున్నారు .
కానీ బాలినేని మాత్రం ఈ విషయంపై ఇప్పటివరకు నోరు మెదపలేదని సమాచారం.