అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా అదనపు వైద్యాధికారిని డాక్టర్ అనుపమ జేమ్స్ చే గర్భవతులకు మీకు తెలుసా కార్యక్రమం ద్వారా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు చూడకుండా సమాజములో కలసి జీవించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్షయ సుఖ వ్యాధులు చికిత్సలపై అవగాహన కల్పిస్తూ ముఖ్యంగా యవ్వనస్తులకు కండోమ్ యొక్క ప్రాధాన్యత తెలియజేశారు. ప్రభుత్వాలు ప్రజలకు అందుబాటులో ఉంచిన హెచ్.ఐ.వి/ఎయిడ్స్ act 2017 ART మందులు APSACS app టోల్ ఫ్రీ నెంబర్ 1097 సర్వీసులు గూర్చి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల సూపర్నెంట్ డాక్టర్ ఎల్లప్ప ఎల్లా రాముడు ఐసీటీసీ సూపర్వైజర్ వెంకటేశులు దేవదాస్ టీబి సూపర్వైజర్ హ్యాండ్స్ సంస్థ సిబ్బంది రమేష్ సందీప్ కుమార్ ఏఎన్ఎం కవిత ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.