మెట్ పల్లి సర్కిల్ పరిధిలో ఈ నెల 16, 17 తేదీల్లో జరిగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే వారిపై రౌడీ షీట్లు తెరుస్తాం. నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా రౌడీ షీటర్లు, ఆటంకం కలిగించే వారితో పాటు డీ జె నిర్వాహకులను తహశీల్దార్ ల ఎదుట బైండో వర్ చేయడం జరిగింది. మెటీపల్లి లో 96 మందిని, మల్లాపూర్ లో 42 మంది, ఇబ్రహీంపట్నం లో 37 మందిని బైండో వేర్ చేశాం. కొత్తగా ఎవరైనా నిమజ్జనం రోజున అల్లర్లు చేసి ఆటంకం కలిగిస్తే వారిపై కూడా రౌడీ షీట్లు తెరుస్తాం. రౌడీ షీట్ల తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రశాంతంగా జరుపుకోవాలి. నిమజ్జనం మధ్యాహ్నం 12గంటల నుంచి మొదలు పెట్టి రాత్రి 11 గంటల లోపు ముగించాలి. డీ జె నిర్వాహకులు ఎట్టి పరిస్థితుల్లోనూ సౌండ్ బాక్సలు ఇవ్వవద్దు. ఒకవేళ ఇస్తే వాటిని సీజ్ చేయడంతో పాటు వారిపై కేసులు పెడతాం. అలాగే మద్యం షాపులు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో కూడా ఎక్కడైనా మద్యం అమ్మితే తీవ్ర మైన చర్యలు ఉంటాయి.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగడానికి అందరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నాం. దాదాపుగా ఒక వంద సీసీ కెమెరాలు అమర్చబడినవి. 150 మంది పోలీసులు మరొక 50 మంది స్పెషల్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు మరియు ట్రాఫిక్ నిబంధనలు ఈ క్రింది విధంగా ఉండబడును అయ్యప్ప గుడి వద్ద నుండి పాత బస్టాండ్ మీదుగా వట్టివాగు వరకు వన్ వే ట్రాఫిక్ ఉండబడును మరియు నిమజ్జనం దగ్గర ఇరువైపులా భారీ కేడ్లు అమర్చబడును, ట్రాఫిక్ పోలీసులు చెప్పిన విధంగా ప్రజలు సంయమనం పాటించి ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బంది కలగకుండా సహకరించగలరు మరియు నిమజ్జనం జరుగు సమయంలో రోడ్డుకు నిమజ్జనం మొదలగు స్థలం నుండి నిమజ్జనం జరిగే స్థలం వరకు ఇరువైపులా షాపులను మూసివేయాలని వ్యాపారస్తులను కోరడమైనది. ఇట్టి బందోబస్తు మెట్పల్లి డి.ఎస్.పి ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో జరుగును.