మెదక్ జిల్లా / వెల్దుర్తి : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట శివారులోని రామంతపూర్ హెచ్ పి పెట్రోల్ పంప్ ప్రక్కన బాబా రాందేవ్ రాజస్థానీ ధాబాలో హర్యాన కు చెందిన గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి గంజాయి కొడుతూ రిపోర్టర్ టివి కెమెరాకి చిక్కిన వార్తను ప్రచురించిన జర్నలిస్ట్ విజయ్ పై తప్పడు కేసులు పెట్టమని వెల్దుర్తి ఎస్సై రాజు , కానిస్టేబుల్ .. కొందరి దగ్గరికి పంపి ప్రోత్సహిస్తున్నట్టు పైనున్న ఫోటోలో మనం గమనించవచ్చు.
గంజాయి వికరిస్తున్న లేదా గంజాయి తాగమని ప్రోత్సహిస్తున్న దాబాలకు అండగా నిలిచిన ఎస్సై పై ఈరోజు రిపోర్టర్ టివి ప్రచురించిన కథనం పై స్థానిక రిపోర్టర్ టివి రిపోర్టర్ పై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్న ఎస్సై పై ఉన్నతాధికారులు స్పందించాలి.
మామూళ్ల మత్తులో మునిగి తేలుతూ దాబా యజమానులు ఇచ్చే తాయిలాలకు అలవాటుపడి నైట్ పెట్రోలోంగ్ లేకుండా గంజాయి విక్రయాలకు అండగా స్థానిక పోలీసులు ఉన్నారని నిలువెత్తున ఆరోపణలు ఉన్నాయి.
ఒక రిపోర్టర్ వెళ్ళి వార్తా సేకరించేవరకు పోలీసులు ఏమి చేస్తున్నట్టు ? తెలుసా ? తెలియదా ? తెలిసి కావాలని వదిలేసినట్టా ? ఈ విషయం పై ఉన్నతాధికారులు స్పందించి జర్నలిస్టు పై తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్న ఎస్సై రాజు పై తగు చర్యలు తీసుకోవాలి.