ప్రకాశం జిల్లా : దర్శి నియోజకవర్గంలో టిడిపి వైసిపిల మధ్య జరిగిన ఘర్షణ వాతావరణం వలన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి వైసీపీ శ్రేణుల పైన అక్రమ కేసులు పెడుతున్నారని దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు మంగళవారం పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దర్శి మొత్తం 300 మంది పోలీసు బలగాలను మోహరించి, దర్శి పట్టణాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగా దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ ను గృహనిర్బంధం గావించారు.