సంగారెడ్డి / పఠాన్ చేరు : ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తున్నారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ ల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేడు వాటి అమలుకు ప్రణాళిక అబద్ధం గా కృషి చేస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తూ వారి జీవితాల్లో ఆర్థిక అభ్యున్నతి చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే నెలలో నూతన రేషన్ కార్డులు అందించబోతున్నామని తెలిపారు. చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల సంరక్షణ కోసమే ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి దేవజ, ఎమ్మార్వో రంగారావు, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.