- టిడిపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఏ.మస్తాన్
మదనపల్లి : అజ్మీర్ యాత్ర ముస్లింలకు పరమ పవిత్రమైందని టిడిపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.ఏ.మస్తాన్ పేర్కొన్నారు.మంగళవారం తమ సొంత నిధులతో 13వ వార్డు నుండి ఎస్.ఏ.మస్తాన్,వార్డు ఇంఛార్జ్ నస్రీన్ తాజ్ మొత్తం 28 మందిని అజ్మీర్ యాత్రకు పంపారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి మైనార్టీ నాయకులు ఎస్.ఏ.మస్తాన్,నస్రీన్ తాజ్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యతనివ్వడం శుభ పరిణామమన్నారు.ఆ అల్లా దయతో అజ్మీర్ యాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు.అనంతరం ఎస్.ఏ.మస్తాన్ మాట్లాడుతూ గతంలో తాము అజ్మీర్,శిరిడి వెళ్ళినప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే సొంత నిధులతో భక్తులను యాత్రకు పంపిస్తామని మొక్కుబడి చేసుకున్నామని,అందులో భాగంగానే రెండవ దఫా అజ్మీర్ యాత్ర బృందాన్ని పంపడం జరిగిందన్నారు.ప్రతి ఏడాది అటు అజ్మీర్,ఇటు షిరిడీలకు 100 మంది చొప్పున పంపడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రాధమ్మ,పులి మహాలక్ష్మీ,దాదాపీర్,షాజీద్,మునీర్ ఖాన్,అక్రమ్,నిస్సార్ అహ్మద్,ఖాజా హుస్సేన్,బావాజాన్,ఇక్బాల్,శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.