- ఐటీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి ని కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ కృష్ణ ప్రసాద్.
బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఐటీ మరియు మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాపట్ల పార్లమెంట్ పరిధిలోని ముఖ్య పట్టణం అయిన చీరాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని తద్వారా అక్కడ ఉన్న యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని విన్నవిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇంకా బాపట్ల పార్లమెంటు పరిధిలోని కొన్ని సమస్యలను గూర్చి మంత్రి నారా లోకేష్ కి వివరించడం జరిగింది.