కరీంనగర్ జిల్లా: సైబర్ నేరాలపై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, మత్తు పదార్థాల బారిన పడొద్దని ఎస్సై తాండ్ర నరేశ్ కోరారు. గన్నేరువరం మండలకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా విద్యార్థులు ఏకాగ్రతతో విద్యను అభ్యసించాలని , అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అవసరమైన మేరకు మాత్రమే సోషల్ మీడియా ఉపయోగించాలని,విద్యార్థులకు సూచించారు.విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, షీటీం నిర్వహిస్తున్న విదుల గురించి, సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్,బాడ్ టచ్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, ఈవిటీజింగ్, నూతన చట్టాల గురించి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు