ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాగులపల్లి మండలం మద్దిరాలపాడు గ్రామంలో రేపు జరగబోయే” ఇది మంచి ప్రభుత్వం”కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.
ఈ కార్యక్రమం యొక్క షెడ్యూలు ఆకస్మికంగా ఖరారైంది. భద్రత ఏర్పాట్లను ప్రకాశం జిల్లా కలెక్టర్ తమిమ్ ఆన్సారియా, జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ పరిశీలించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించే హెలికాప్టర్ ల్యాండింగ్ కు చదలవాడలోని రవి ప్రియా విల్లాస్ లో ఉన్న హెలిపాడ్‌ను, మద్దిరాలపాడు లోని సభా ప్రాంగణాన్ని, సభా ఏర్పాట్లను, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
ఆకస్మిక పర్యటన కావడంతో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని జిల్లా అధికారులందరికీ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు